ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల కానున్న కొత్త ఫోర్స్ వన్

ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2012లో ఒక ఫోర్-వీల్ (ఆల్-వీల్) డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఎస్‌యూవీని, విలాసవంతమైన ఇంటరీయర్లతో కూడిన ఓ లగ్జరీ కాన్సెప్ట్‌ను ప్రదర్శించనున్నామని ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియా తెలిపారు. అంతేకాకుండా, 26 సీట్లు కలిగిన ఓ కొత్త మోనోక్వాక్ బస్‌ను కూడా విడుదల చేయనున్నామని, ఇది ఏప్రిల్ 2011 నాటికి ఉత్పత్తి దశకు వస్తుందని ఆయన చెప్పారు.
ఈ బస్సులో కూడా రెండు వేరియంట్లు ఉంటాయని, అందులో లగ్జరీ వెర్షన్ 10-18 సీట్లతోనూ, స్టాండర్డ్ వెర్షన్ 26 సీట్లను కలిగి ఉంటుందని ఫిరోడియా తెలిపారు. అయితే, ఈ ఉత్పత్తుల ధరలు, ఇతర సాంకేతిక వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 6న ఢిల్లీలో వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications








