ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్వాడ్ బైక్ వాజుమా వీ8

దీని గరిష్ట వేగం గంటకు జస్ట్ 241 కి.మీ. మాత్రమే. వాజుమా వీ8 క్వాడ్ బైక్‌ను ఫ్రెంచ్ కంపెనీ అయిన లాజరెత్ రూపొందించింది. ఇది అత్యంత శక్తివెంతమైన క్వాడ్ బైక్. దీనిని సాధారణ రోడ్లపై నడిపేందుకు అనుమతి లేదు, ఇది ప్రత్యేకించి ఆఫ్-రోడింగ్ ప్రయోజనం కోసం మాత్రమే రూపొందించబడినది.
ఇందులో 250 బిహెచ్‌పి శక్తిసామర్థ్యాలు కలిగిన ఫెరారీ ఇంజన్‌ను, బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 హ్యాండిల్ బార్‌ను అమర్చారు. ప్రస్తుతం ఈ క్వాడ్ బైక్‌ను లగ్జరీ వెబ్‌సైట్ జేమ్స్‌లిస్ట్‌లో 2,66,000 అమెరికన్ డాలర్ల ధరకు విక్రయానికి ఉంచారు. ఈ వాహనాన్ని సొంతం చేసుకోవాలంటే మీరు "బ్రూస్‌వేన్" (బ్యాట్‌మ్యాన్ సినిమాలో క్యారెక్టర్ పేరు) అయి ఉండాలి. బహుశా ఇది బ్యాట్‌మ్యాన్‌కు సైతం ఈర్ష పుట్టిస్తుందేమో..!!


Click it and Unblock the Notifications








