సరికొత్త ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్న హ్యుందాయ్

Hyundai i20
దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ "హ్యుందాయ్ ఐ20"లో మరో సరికొత్త వేరియంట్ త్వరలోనే భారత వినియోగదారులకు కనువిందు చేయనుంది. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించిన రహస్య చిత్రాలు (స్పై షాట్స్) ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

హ్యుందాయ్ నుండి అత్యంత పాపులర్ అయిన్ ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని సరికొత్త ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఐ20 వెర్షన్‌ను "హ్యుందాయ్ ఐ20 ఫ్లూయిడిక్" అని పిలిచే అవకాశం ఉంది. మరికొద్ది నెలల్లో ఈ బుజ్జి కారు భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ సరికొత్త ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారును భారత రోడ్లపై టెస్ట్ చేస్తోంది. కొత్త హ్యుంద్యా ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లోని ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్, ఇంజన్ పెర్ఫామెన్స్‌లలో మార్పులు ఉండనున్నాయి.

కొత్త హ్యుందాయ్ ఐ20లో ఉండనున్న మార్పుల వివరాలు:
- సరికొత్త డిజైన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్
- కొత్త ఫ్రంట్ (ముందు) బంపర్
- కొత్త డిజైన్ కలిగిన వీల్-క్యాప్స్/కవర్స్
- ఫ్రంట్ గ్రిల్‌పై ఫ్లూయిడిక్ డిజైన్
- ముందువైపు క్రోమ్ కోటింగ్
- రీడిజైన్ చేయబడిన డోర్స్
- కొత్త డిజైన్ కలిగిన టెయిల్ ల్యాంప్స్
- కొత్త రియర్ (వెనుక) బంపర్
- రియర్ బంపర్‌పై ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్స్
- మరింత స్పోర్టీ లుక్‌నిచ్చే రియర్ డిజైన్
- మంచి పెర్ఫామెన్స్ కోసం అభివృద్ధి చేయబడిన ఇంజన్
- ఇంటీరియర్లలో కాస్మోటిక్ మార్పులు

ఇవే కాకుండా మరికొన్ని సాంకేతిక మార్పులు, ఫీచర్లు కూడా కొత్త హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో ఉండనున్నాయి. వాటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీని ధర విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఐ20 కన్నా స్వల్పంగా అధిక ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ సరికొత్త హ్యుందాయ్ ఐ20 ఫ్లూయిడిక్ ఇదే సెగ్మెంట్లో ఉన్న కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్, జనవరిలో మార్కెట్లోకి రానున్న ఫియట్ గ్రాండే పుంటో, కొత్త హోండా జాజ్ మోడళ్లకు పోటీగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 21, 2011, 15:36 [IST]
English summary
Hyundai Motors India will soon launch a facelifted version of the i20 hatchback that will have the fluidic design that we have already seen in the Fluidic Verna. Several design changes are expected to be made in the i20 including in the front end as well as the interiors. Stay tuned for more updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+