భారత్‌కు లెక్సస్ కార్లు; దక్షిణాఫ్రికాకు ఎతియోస్ కార్లు
ప్రస్తుతం ఎతియోస్, లివా కార్లను కర్ణాటకలోని టొయోటా ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. ఈ మోడళ్ల ఉత్పత్తి కోసం దాదాపు 70 శాతం విడిభాగాలను కంపెనీ భారత్ నుండే కొనుగోలు చేస్తుంది. దీన్ని 90 శాతానికి పెంచేందుకు భారత్‌లోనే ఇంజన్, ట్రాన్స్‌మిషన్‌ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నామని, మరో ఏడాది నాటికి ఇది అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.
భారత్ మార్కెట్లోకి లెక్సస్ కార్లు:
అలాగే, మరో రేండేళ్లలో అమెరికాలో అత్యంత పాపులర్ అయిన తమ లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్‌ను భారతీయులకు పరిచయం చేస్తామని, లెక్సర్ కార్లను భారత్‌లో ప్రవేశపెట్టే విషయమై ప్రస్తుతం తాము మార్కెట్ అధ్యయనం చేస్తున్నామని నగాకా చెప్పారు. లెక్సస్ బ్రాండ్ కార్ల కోసం కంపెనీ ప్రత్యేకంగా కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది. అమెరికన్ల ఫేవరేట్ కార్ బ్రాండ్ అయిన లెక్సస్ మరి భారతీయులను ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే మరో రెండేళ్లు వేచి ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications









