మిత్సుబిషి ఎస్‌యూవీపై లక్ష రూపాయల ఇంధనం ఫ్రీ!

అమ్మకాలను పెంచుకునేందుకు మిత్సుబిషి అందిస్తున్న వివిధ మోడళ్లపై డిస్కౌంట్లు, వివిధ ఆఫర్లను ప్రకటించింది. ప్రిమీయం ఎస్‌యూవీలకు పెట్టింది పేరయిన మిత్సుబిషి అందిస్తున్న అవుట్‌లాడ్ ఎస్‌యూవీపై లక్షల రూపాయల విలువైన ఇంధనం మరియు ఉచిత ఇన్సూరెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే, కంపెనీ అందిస్తున్న మోంటెరో, పాజెరో ఎస్‌యూవీలపై ఉచిత ఇన్సూరెన్స్ ఆఫర్లను కంపెనీ అందిస్తుంది.
ఈ మోడళ్ల అమ్మకాలు గడచిన నెలలో గణనీయంగా తగ్గిపోవడంతో, వీటి అమ్మకాలకు ఊతమిచ్చేందుకు, అలాగే స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ ఈ ఆఫర్లను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 లోపు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా, వచ్చే సంవత్సరం తొలి త్రైమాసికంలో మిత్సుబిషి కంపెనీ ఓ సరికొత్త 2012 పాజెరో ఎస్‌యూవీని విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








