విడుదలకు సిద్ధమైన మహీంద్రా తొలి కాంపాక్ట్ కారు

Reva NXR
బెంగూళూరుకు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ 'రేవా' నుండి వాటాలను కొనుగోలు చేసిన ఎస్‌యూవీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తొలిసారిగా ఓ కాంపాక్ట్ కారును వినియోగదారులకు పరిచయం చేయనుంది. మైలేజ్ విషయంలో ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన పెట్రోల్ కారు కన్నా తొమ్మి రెట్లు మెరుగ్గా ఉండే తమ చిన్న కారు ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది.

ఈ మేరకు కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఫోర్-సీటర్ "మహీంద్రా రేవా ఎన్ఎక్స్ఆర్" ఎలక్ట్రిక్ కారును వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ విడుదల చేయనుంది. ఇది 2001లో విడుదలైన రేవా ఎలక్ట్రిక్ కారు తర్వాత వస్తున్న తొలి అప్‌గ్రేడెడ్ మోడల్. మొదటితరం (ఫస్ట్ జనరేషన్) రేవా ఎలక్ట్రిక్ కారు కన్నా ఇది ఎంతో మెరుగైనది.ఇందులో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు గానూ ఇందులో అధిక మన్నిక గల బ్యాటరీని ఉపయోగించారు.

బ్యాటరీ పవర్ ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండేందుకు దీని గరిష్ట వేగాన్ని కూడా నియంత్రించడం జరిగింది. ఈ రేవా ఎన్ఎక్స్ఆర్ కారును పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే, 160 కి.మీ. రేంజ్ ప్రయాణించవచ్చు. అంటే దీని రేంజ్ పాత రేవా కన్నా రెండు రెట్లు ఎక్కువ. నలుగురు ప్రయాణికులు కూర్చుకున్నప్పుడు కూడా ఈ కారును గరిష్టంగా గంటకు 100 కి.మీ. వేగంతో నడపవచ్చు. పాత రేవా గరిష్ట వేగం 80 కి.మీ. మాత్రమే. రేవా ఎన్ఎక్స్ఆర్ కారులో రూ.3 ఖర్చుతో 9.6 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

లీటరుకు 25 కి.మీ. మైలేజీనిచ్చే టాటా ఇండికా ఈవీ2, టాటా నానో వంటి పెట్రోల్ కార్లు అదే రూ.3 లకు కేవలం ఒక్క కి.మీ. దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. అంటే.. సాధారణ పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే మైలేజ్ విషయంలో రేవా ఎన్ఎఎక్స్ఆర్ కారు తొమ్మిది రెట్లుకు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం లభిస్తున్న నాన్-ఏసి రేవా కారు ధర రూ.3.2 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), ఏసి రేవా కారు ధర రూ.3.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, December 23, 2011, 11:34 [IST]
English summary
Country's largest utility maker Mahindra to launch of its first compact car Reva NXR by next year. This new electric car can be run for 9.6 kilometres at a cost of Rs.3. Which means the Reva NXR's mileage is 9 times more than a conventional petrol car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+