స్కొడా లారా డీజిల్ వేరియంట్‌పై రూ.70,000 డిస్కౌంట్!
ప్రస్తుతం దాదాపు అన్ని కార్ కంపెనీలు పెట్రోల్ వేరియంట్లపై డిస్కౌంట్లను అందిస్తుండగా, స్కొడా మాత్రం డీజిల్ వేరియంట్‌పై డిస్కౌంట్‌ను అందించడం విశేషం. స్కొడా డీలర్లు అందిస్తున్న ఈ ఆఫర్ల ప్రకారం, లారా ఆంబిషన్ డీజిల్ వేరియంట్ రూ.50,000 డిస్కౌంట్‌ను లారా ఎలిగాన్స్ వేరియంట్‌పై రూ.70,000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.
ఈ డిస్కౌంట్స్ అనంతరం స్కొడా లారా ఆంబిషన్ వేరియంట్ ధర రూ.14.23 లక్షల నుండి రూ.13.73 లక్షలకు తగ్గగా, స్కొడా లారా ఎలిగాన్స్ వేరియంట్ ధర రూ.15.75 లక్షల నుండి రూ.15.05 లక్షలకు తగ్గింది.ఈ డిస్కౌంట్‌ల కారణంగా ధర విషయంలో గమనిస్తే ఇదే సెగ్మెంట్లో లభిస్తున్న ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, టొయోటా కరోలా ఆల్టిస్, రీనాల్ట్ ఫ్లూయెన్స్ సెడాన్‌ల కాన్న ఈ డీల్ ఎంతో మెరుగైనది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 25 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications









