కొత్త సంవత్సరంలో ధరలను పెంచనున్న ఆడి ఇండియా!

జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా కొత్త సంవత్సరంలో ధరల బాదుడుకు సిద్ధమైంది. రానున్న జనవరి నుండి తమ ఉత్పత్తులన ధరలను 1-2 శాతం మేర పెంచాలని కంపెనీ యోచిస్తోంది. రూపాయి విలువ బలహీనపడటం, ఫలితంగా దిగుమతి చేసుకునే విడిభాగాల ధరల పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

భారత్‌లో ఆడి ఇండియా ఉత్పత్తి చేస్తున్న మోడళ్లతో పాటుగా, కంపెనీ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకునే మోడళ్ల ధరలను కూడా పెంచనున్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే వచ్చే ఏడాదిలో ధరల పెంపుపై జనరల్ మోటార్స్, టొయోటా, మారుతి సుజుకి వంటి వివిధ కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆడి ఇండియా భారతదేశపు లగ్జరీ కార్ మార్కెట్లో అమ్మకాల పరంగా తృతీయ స్థానంలో ఉంది. 2012 తొలి త్రైమాసికంలో కంపెనీ అందిస్తున్న అన్ని రకాల ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఆడి ఇండియా అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉండి, 2011 సంవత్సరానికి గాను నిర్దేశించుకున్న అమ్మకాల లక్ష్యాన్ని కూడా అధిగమించింది.

భారత మార్కెట్లో ఆడి ఇండియా అందిస్తున్న లగ్జరీ కార్ల ధరల శ్రేణి రూ.27.69 లక్షల మొదలుకొని రూ.1.50 కోట్ల వరకూ (ఎక్స్‌-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. ఇదిలా ఉండాగా.. రానున్న జనవరిలో జరగనున్న 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ మూడు కొత్త కార్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 24, 2011, 12:19 [IST]
English summary
German luxury carmaker Audi India may revise the car prices in 2012. Company will increase the prices of its entire range of models, mainly due to falling rupee and rising input costs in the recent months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+