డీజిల్ వాహనాలపై ఎక్కువ ఎక్సైజ్ పన్ను వద్దు: పటేల్

Praful Patel
డీజిల్‌ వాహనాలపై అధికంగా ఎక్సైజ్‌ పన్నులను విధించవద్దని కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖా మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని లిఖితపూర్వకంగాకోరారు. గతంలో పర్యావరణ ప్రభావిత అంశాలను దృష్టిలో ఉంచుకొని, డీజిల్‌ వాహనాలను తగ్గించేందుకు గానూ పెద్ద కార్లపై విధించిన అదనరపు రూ.15,000 ఎక్సైజ్‌ సుంకాన్ని తొలగించాలని ప్రణబ్ ముఖర్జీకి సమర్పించిన లేఖలో ఆయన కోరారు.

గతంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా డీజిల్‌ కార్లపై ఎక్కువగా ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించాల్సి వస్తుంది. అయితే, యూరప్‌, అమెరికా, జపాన్‌ వంటి దేశాలలో డీజిల్‌ వాహనాలకే పెద్ద పీట వేస్తున్నారని, కానీ మనం దేశంలో మాత్రం డీజిల్‌ వాహనాలకు ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానం యొక్క అవసరం మనకు ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.

గతంలో మన దేశంలో డీజిల్ కార్లకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. ఇందుకు ప్రధాన కారణం, వీటి మెయింటినెన్స్ అధికంగా ఉండటమే. అయితే, ప్రస్తుతం అందుబాటులోకి సిఆర్‌డిఐ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా ప్రస్తుతం దేశంలో డీజిల్ కార్ల వాడకం విరివిగా పెరిగింది. డీజిల్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మోడళ్లపై గతంలో విధించిన అధనపు సుంకాన్ని పూర్తిగా తొలగించాలనేది ప్రఫుల్ పటేల్ వాదన.

More from DriveSpark

Article Published On: Monday, December 26, 2011, 14:56 [IST]
English summary
Heavy Industries and Public Enterprises minister Praful Patel has written to finance minister Pranab Mukherjee urging him not to impose higher excise duty on diesel cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+