నానోలో స్టార్టర్ మోటార్ రీప్లేస్ చేయనున్న టాటా మోటార్స్

ఈ అప్‌గ్రేడెడ్ స్టార్టర్ మోటార్‌ను 2012 వెర్షన్ టాటా నానోలో ఉపయోగించారు. మెరుగైన ఇంజన్ పెర్ఫామెన్స్ కోసం పాత స్టార్టర్ మోటార్ కన్నా మెరుగైన స్టార్టర్ మోటార్‌ను టాటా నానో వినియోగదారులకు అందించనున్నామని ఆయన చెప్పారు. ఇంజన్‌లో పిస్టన్‌లను తిప్పేందుకు ఈ స్టార్టర్ మోటార్ ఉపయోగపడుతుంది.
టాటా నానో వినియోగదారులు తమ సమీపంలోని టాటా నానో షోరూమ్ లేదా సర్వీస్ సెంటర్లలో ఉచితంగా ఈ స్టార్టర్ మోటార్‌ను అమర్చుకోవచ్చు. దీనివలన కంపెనీకు ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే, కంపెనీ ఇందుకు భారీ మొత్తాన్నే వెచ్చిస్తున్నట్లు సమాచారం.
ఏదేమైనప్పటికీ సుమారు 1,45,000 లకు పైగా టాటా నానో కార్లలో కంపెనీ ఈ స్టార్టర్ మోటార్‌ను రీప్లేస్ చేయనుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని టాటా మోటార్స్ అవుట్‌లెట్ లేదా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications








