ఇయాన్‌ను టెస్ట్ డ్రైవ్ చేయండి: డాన్2 మూవీ ఫ్రీగా చూడండి!

కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన హ్యుందాయ్ ఇయాన్ కారును టెస్ట్ డ్రైవ్ చేసిన వారికి డాన్2 సినిమా టికెట్లు గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దాదాపు అన్ని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో కంపెనీ ఈ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, హ్యుందాయ్ ఇయాన్ కారును టెస్ట్ డ్రైవ్ చేసిన వారికి డాన్2 పోస్టర్లను కూడా అందిస్తుంది.
ఈ అవుట్‌లెట్లలో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో గెలిచిన వారికి ప్రముఖ థియేటర్లలో రెండు డాన్2 టికెట్లను ఇవ్వనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దేశీయ విపణిలో హ్యుందాయ్ ఇయాన్ ధరలు రూ.2.70 లక్షల నుండి రూ.3.72 లక్షలుగా ఉంది.
డాన్2 చిత్రంలో 2012 హ్యుందాయ్ సొనాటా సెడాన్, శాంటాఫే ఎస్‌యూవీ కార్లతో షారుఖ్ ఖాన్ చేసిన సాహస రైడ్‌లను, స్టన్నింగ్ కార్ ఛేజ్‌లను చూడొచ్చు. మరికెందుకు ఆలస్యం వెంటనే మీ సమీపంలోని హ్యుందాయ్ అవుట్‌లెట్‌కు వెళ్లి ఇయాన్ కారును టెస్ట్ డ్రైవ్ చేసి డాన్2 సినిమాను ఫ్రీగా చూసే లక్కీ ఛాన్స్‌ను సొంతం చేసుకోండి.


Click it and Unblock the Notifications








