ప్రపంచంలోనే అత్యధిక మైలేజీనిచ్చే కారు 'టొయోటా ఆక్వా'

డ్యూయెల్ పవర్‌తో పనిచేసే ఆక్వా హైబ్రిడ్ కారు ప్రతి లీటర్ పెట్రోల్‌కు 35.4 కి.మీ. మైలేజీనిస్తుంది. ప్రస్తుతం టొయోటా అందిస్తున్న "ప్రయస్" హైబ్రిడ్ సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించిన హ్యాచ్‌బ్యాక్ వెర్షనే టొయోటా ఆక్వా. జపాన్‌లో ఈ మోడల్‌ను ఆక్వా పేరుతో విక్రయించనుండగా, ప్రపంచ మార్కెట్లలో మాత్రం "ప్రయస్ సి" పేరుతో విక్రయించనున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న టొయోటా ప్రయస్ సెడాన్ కారు కన్నా టొయోటా ఆక్వా హైబ్రిడ్ కారు అధిక మైలేజీని ఇస్తుంది. టొయోటా ప్రయస్ హైబ్రిడ్ మైలేజ్ లీటరుకు 32 కి.మీ. ఆక్వా హ్యాచ్‌బ్యాక్‌లో 1.5 లీటర్ పెట్లో ఇంజన్ను అమర్చారు. దీని ప్రారంభ ధర రూ.11 లక్షలకు పైమాటే. త్వరలోనే టొయోటా ఆక్వా హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








