ఎక్స్‌యూవీ500 ధరలను పెంచిన ఎమ్ అండ్ ఎమ్

Mahindra XUV500
గతంలో చెప్పుకున్నట్లుగానే, ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే దేశీయ విపణిలో విడుదల చేసిన చీప్ అండ్ బెస్ట్ గ్లోబల్ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) "ఎక్స్‌యూవీ500" (ఎక్స్‌యూవీ ఫైవ్ డబుల్ ఓ) ధరలు మరింత ప్రియం అయ్యాయి. వేరియంట్‌ను ఎక్స్‌యూవీ500 ధరలు రూ.30,000 నుండి రూ.55,000 వరకూ పెరిగాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసే సమయంలో దీని ధరలను మరో మూడు నెలల్లో సవరించే అవకాశం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ చెప్పినట్లుగానే ఈ ఎస్‌యూవీ ధరలను భారీగా పెంచింది. పెరిగిన ధరలు (వేరియంట్ల వారీగా) క్రింది విధంగా ఉన్నాయి.

* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 (బేస్ వేరియంట్) - రూ.30,000
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) - రూ.50,000
* మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఫోర్-వీల్ డ్రైవ్) - రూ.55,000

పెరిగిన ధరలు జనవరి ఒకటి నుండి అమలులోకి రానున్నాయి. అంతేకాకుండా.. ఇప్పటికే బుకింగ్ చేసుకుని, జనవరి తర్వాత డెలివరీ పొందనున్న వినియోగదారులు పెరిగిన ధరలో 50 శాతాన్ని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోడల్‌కు లభిస్తున్న అపూర్వ స్పందన కారణంగా డిమాండ‌కు సప్లయ్ చేయలేని కంపెనీ కొత్త బుకింగ్‌లను తీసుకోవడాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.

కాగా.. జనవరి 1, 2012 నుండి మహీంద్రా ఎక్స్‌యూవీ500 బుకింగ్‌లను రీఓపెన్ చేయనున్నట్లు ఎమ్ అండ్ ఎమ్ తెలిపింది. కేవలం ఎక్స్‌యూవీ500 ధరలను మాత్రమే కాకుండా ఇతర వేరియంట్ల ధరలను కూడా కంపెనీ పెంచనుంది. గడచిన సెప్టెంబర్ నెలలో కేవలం రూ.10.80 లక్షల ప్రారంభ ధరకే ఎమ్ అండ్ ఎమ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500ను విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభిస్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ500 ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 (బేస్ వేరియంట్) మోడల్ ధర రూ. 10.80 లక్షలు
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 11.95 లక్షలు
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 12.88 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

More from DriveSpark

Article Published On: Wednesday, December 28, 2011, 19:29 [IST]
English summary
Mahindra and Mahindra's latest global SUV Mahindra XUV500 prices will go up from January 2012. M and M will hike all its products prices from January 2012 company announced in a statement. At present M and M offering the all-new XUV500 at an unbeatable price of Rs.10.80Lacs (ex-showroom Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+