అమెరికాలో 1,29,000 కార్లను రీకాల్ చేసిన ఫోర్డ్ మోటార్ కో
అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ నుండి అత్యధికంగా అమ్మడవుతున్న ఫోర్డ్ ఫ్యుజన్, మెర్క్యూరీ మిలన్ కార్లను రీకాల్ చేసింది. అమెరికాలో విక్రయించిన ఈ రెండు మోడళ్లలో ఉపయోగించిన 17 ఇంచ్ స్టీల్ వీల్స్ సమస్య కారణంగా దాదాపు 1,29,000 కార్లను రీకాల్ చేస్తున్నట్లు అమెరికా భద్రతా నియంత్రణ సంస్థ ప్రకటించింది.
ఈ కార్లలో అమర్చిన 17 ఇంచ్ స్టీల్ వీల్స్ ఈడిపోయే ప్రమాదం ఉన్నందు వలను ఈ రీకాల్ చేస్తున్నట్లు ఏజెన్సీ పేర్కొంది. 2010-11 మోడల్ ఇయర్‌కు చెందిన వాహనాల్లో ఉపయోగించిన స్టీల్ వీల్స్ స్టడ్స్ విరిగిపోయి కారు షేక్ అయ్యే ప్రమాదం ఉందని, దీన్ని అలాగే నిర్లక్ష్యం చేస్తే గమనంలో ఉన్న కారు నుండి చక్రం ఊడిపోయి పెద్ద ప్రమాదం వాటిళ్లే అవకాశం ఉంది.
అమెరికాలో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన ఫోర్డ్ మోటార్ కో దీనిపై స్పందిస్తూ.. వీల్ మౌంటిగ్ ప్యాడ్స్ లేదా రియర్ డిస్క్ బ్రేక్‌ల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుండవచ్చునని, ఈ రీకాల్ గురించి వినియోగదారులకు ప్రత్యేకంగా తెలియజేస్తామని కంపెనీ తెలిపింది. ఈ రీకాల్ గురించి అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది.


Click it and Unblock the Notifications








