బంగ్లాదేశ్‌కు పయనమైన హిందూస్థాన్ మోటార్స్ అంబాసిడర్

Ambassador
భారత మార్కెట్లోకి హిందూస్థాన్ మోటార్స్ వారి అంబాసిడర్ కారు ఓ విశిష్టమైన గుర్తింపు ప్రత్యేకత ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో దశాబ్ధాల కాలంగా కీలక పాత్రను పోషిస్తూ వస్తున్న అంబాసిడర్ కారంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఇది టాక్సీగా మారి ఎంతో మంది ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా, మరెంతో మందికి జీవనాధారంగా నిలించింది. అప్పట్లో ఇది స్టేటస్ సింబల్‌గా ఉండేది.

కొన్ని ప్రాంతాల్లో అంబాసిడర్ కారు ఇప్పటికీ ప్రభుత్వాధికారులకు అధికార వాహనంగా ఉంది. ఇంతటి ఘన చరిత్రను కలిగిన అంబాసిడర్ కారు ఇకపై పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో కూడా లభ్యం కానుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో పలు దేశీయ విదేశీయ కార్ కంపెనీల నుండి ఎదురవుతున్న గట్టి పోటీ కారణంగా అంబాసిడర్ అమ్మకాలు క్షీణించాయి.

ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకు అంబాసిడర్ కారును ఎగుమతి చేయడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో భాగంగానే హిందూస్థాన్ మోటార్స్ తాజాగా అంబాసిడర్ కారును బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విడుదల చేసింది. ఈ విడుదల కార్యక్రమానికి అశేష స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది.

అయితే, బంగ్లాదేశ్‌లో అధిక దిగుమతి సుంఖాల కారణంగా, అక్కడి మార్కెట్లో అంబాసిడర్ కారు ధర కాస్తంత ప్రియంగానే ఉండనుంది. బంగ్లాదేశ్‌ మార్కెట్లో అంబాసిడర్ కారు ధర 1.550 మిలియన్ టాకాలు (బంగ్లాదేశ్ కరెన్సీ) నుండి 2.250 మిలియన్ టాకాల మధ్యలో ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ మరియు సిఎన్‌జి ఆప్షన్లలో లభ్యమవుతుంది. అంబాసిడర్ కార్ల దిగుమతి కోసం బంగ్లాదేశ్‌లోని ఇంట్రాకో మోటార్స్‌ను హిందూస్థాన్ మోటార్స్ తమ అధికారిక దిగుమతిదారుగా నియమించుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 12, 2011, 18:26 [IST]
English summary
The Ambassador has been a classic Indian car despite its British roots. The car has now got a status of a vintage car despite still being in the market. There are several people who love to own an Ambassador but not much seems to be happening in terms of sales.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+