జనవరి నుండి ప్రియం కానున్న మైక్రా, సన్నీ కార్ల ధరలు

దేశీయ విపణిలో జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ మోటార్ ఇండియా అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు మైక్రా, సెడాన్ కారు సన్నీ ధరలు వచ్చే జనవరి నుంచి మరింత ప్రియం కానున్నాయి. ఎందుకంటే, వివిధ కారణాలు చెప్పి వచ్చే జనవరి నుంచి ఉత్పత్తుల ధరలు పెంచనున్న కంపెనీల జాబితాలో నిస్సాన్ కూడా చేరిపోయింది. ముఖ్యంగా రూపాయి విలువ క్షీణత కారణంగా ధరలు పెంచాలని నిస్సాన్ యోచిస్తోంది.

ఈ మేరకు మైక్రా, సన్నీ పెట్రోల్ వేరియంట్ కార్ల ధరలను జనవరి 2012 నుంచి 2 శాతం వరకూ పెంచాని నిస్సాన్ మోటార్ ఇండియా భావిస్తోంది. అయితే, ఈ రెండు మోడళ్లలో లభ్యమవుతున్న డీజిల్ వేరియంట్ల ధరల పెంపు విషయమై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కంపెనీ తాజాగా, నిస్సాన్ సన్నీ సెడాన్‌లో డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ రెండు మోడళ్లు కాకుండా, సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ధరలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరి ధరల పెంపుకు సంబంధించి టొయోటా, జనరల్ మోటార్స్, ఫోర్డ్ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా తదితర కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Wednesday, December 14, 2011, 12:11 [IST]
English summary
Nissan Micra and Nissan Sunny petrol prices will go up from January 2012. Company wants to increase these models price by 0-2% due to Indian Rupee currency fluctuations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+