క్లియరెన్స్ సేల్ ధమాకా..: ఫియస్టాపై రూ.75,000 తగ్గింపు

Ford Fiesta
మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్లుగానే, మరో ఒకటిన్నర నెలతో 2011 సంవత్సరం ముగుస్తుండటంతో పలు కార్ల కంపెనీలు పెట్రోల్ కార్లపై భారీ తగ్గింపులు, ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ భారత మార్కెట్లో అందిస్తున్న సరికొత్త గ్లోబల్ ఫియస్టా సెడాన్‌ వెర్షన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తుంది.

ప్రస్తుతం వినియోగదారులు కొత్త ఫియస్టా పెట్రోల్ వేరియంట్ కొనుగోలుపై రూ.75,000 విలువైన తగ్గింపును పొందవచ్చు. డిస్కౌంట్‌కు ముందు ఫోర్డ్ ఫియస్టా పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.8.23 లక్షలుగా ఉంది. కాగా.. డిస్కౌంట్ అనంతరం ఫోర్డ్ ఫియస్టా పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.7.48 లక్షలుగా ఉంది.

అంటే ధర విషయంలో కొత్త ఫోర్డ్ ఫియస్టా సెడాన్ కూడా హోండా సిటీ సెడాన్ సరసన చేరిపోయిందన్నమాట. కొత్త ఫియస్టా సెడాన్‌ గడచిన జులై నెలలో దేశీయ విపణిలోకి ప్రవేశించింది. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ టిఐవిసిటి పెట్రోల్ ఇంజన్ 106.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని విడుదల చేస్తూ ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటరు పెట్రోల్‌కు 17 కి.మీ. మైలేజీనిస్తుంది.

గ్లోబల్ ఫోర్డ్ ఫియస్టా సెడాన్ డీజిల్ వేరియంట్లో కూడా లభ్యమవుతుంది. డీజిల్ వేరియంట్ ఫియస్టా ధరలు రూ. 9.27 లక్షల నుంచి రూ. 10.42 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి. కొత్త ఫియస్టా ఏబిఎస్, ఈబిడి, ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు స్టీరింగ్ వీల్ ఆడియో కంట్రోల్ సిస్టమ్ అన్ని వేరియంట్లలో ఓ పరిమితిగా వస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే.

More from DriveSpark

Article Published On: Monday, November 14, 2011, 18:01 [IST]
English summary
US based Ford Motor Corporation fully Indian subsidiary Ford Motor offering huge discount on all new Ford Fiesta sedan. Buyer now get discount of Rs 75,000 on the petrol variants of the all new Fiesta sedan. This offer includes exchange bonus, free insurance and accessories. This offer is limited period only.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+