నవంబర్ నెలలో 35 శాతం పెరిగిన టాటా గ్లోబల్ సేల్స్

Tata Global Sales
గడచిన నెలలో టాటా మోటార్స్ గ్రూప్ ప్రపంచవ్యాప్త అమ్మకాలు జోరుగా సాగాయి. నవంబర్ 2011లో టాటా మోటార్స్ గ్రూప్ (జాగ్వారా ల్యాండ్ రోవర్‌తో కలిపి) అమ్మకాలు 35 శాతం వృద్ధిని సాధించి 1,08,028 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ నెల వరకూ కలిపి మొత్తం అమ్మకాలు 10 శాతం వృద్ధిని నమోదు చేసుకుని 7,50,457 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

టాటా, టాటా దేవూ, టాటా హిస్పానో కార్రోసెరా బ్రాండ్‌ల నుంచి లభిస్తున్న వాణిజ్య వాహనాల గ్లోబల్ అమ్మకాలు 24 శాతం వృద్ధిని సాధించి 49,724 యూనిట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇవి నవంబర్ నెల వరకూ కలిపి మొత్తం అమ్మకాలు 18 శాతం వృద్ధిని నమోదు చేసుకుని 3,71,410 యూనిట్లుగా ఉన్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.

నవంబర్ 2011 నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 27 శాతం వృద్ధిని సాధించి 29,183 యూనిట్లుగా నమోదు కాగా, ఇందులో కేవలం జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 5 శాతం వృద్ధితో 5,315 యూనిట్లు మరియు ల్యాండ్ రోవర్ బ్రాండ్ అమ్మకాలు 38 శాతం వృద్ధితో 23,868 యూనిట్లు అమ్ముడయ్యాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 15, 2011, 17:41 [IST]
English summary
The Tata Motors Group global wholesales, including Jaguar Land Rover, were 108,028 nos., in November 2011, higher by 35% over November 2010. Cumulative sales for the fiscal are 750,457 higher by 10% compared to the corresponding period in 2010-11.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+