రాష్ట్రంలో సిఎన్‌జీ వేరియంట్ వాహనాలకు డిమాండ్ అదుర్స్

ఈ నేపథ్యంలో తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో కూడిన మారుతి సుజుకి సిఎన్‌జీ కార్ల కొనుగోలుపై రాష్ట్ర వాసులు దృష్టి సారిచారని, ఫలితంగా ఈ వేరియంట్లకు డిమాండ్ పెరిగిందని కంపెనీ మార్కెటింగ్ ఛీఫ్ జనరల్ మేనేజర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. రాష్ట్రంలో నెలకు 250 యూనిట్లకు పైగా సీఎన్‌జీ వేరియంట్ కార్లను విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం మారుతి సుజుకి అందిస్తున్న సిఎన్‌జీ వేరియంట్లలో మూడు చిన్న కార్లు ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో మోడళ్లు అలాగే.. మల్టీ యుటిలిటీ వాహనం (ఎమ్‌యూవీ) ఈకో మరియు ఎస్ఎక్స్4 సెడాన్ కార్లు ఉన్నాయి. ఈ మోడళ్ల మొత్తం అమ్మకాలలో సుమారు 10 శాతం సిఎన్‌జీ వేరియంట్లే ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ ఐ-జీపీఐ సీఎన్‌జీ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి.
సంప్రదాయ కిట్లతో పోల్చి చూస్తే ఈ టెక్నాలజీ ఎంతో సురక్షితమైందని, అధిక మైలేజీని కూడా పొందవచ్చని శశాంక్ తెలిపారు. ఒక్క కిలో సీఎన్‌జీ ధర రూ.42 ఉంది. సిఎన్‌జీ వేరియంట్ వాహనాలకు ప్రతి కిలోమీటరకు అయ్యే ఖర్చు కేవలం రూ.1.60 మాత్రమే. అదే పెట్రోల్ వేరియంట్ అయితే, ప్రతి లీటరుకు రూ.3.80, డీజిల్ రూ.2 వ్యయం అవుతుంది.
ఇదిలా ఉంటే పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో రానున్న కాలంలో మరిన్ని సిఎన్‌జీ, హైబ్రిడ్ వేరియంట్లను ప్రవేశపెట్టేందురు మారుతి సుజుకి ఇండియా కసరత్తులు మొదలెట్టింది. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరల కన్నా సిఎన్‌జీ ధర చాలా తక్కువగా ఉండమే కాకుండా, అధిక ఇంధన సామర్థ్యాన్ని (మైలేజ్)ను ఇస్తుంది. అయితే, ప్రస్తుతం సిఎన్‌జీ ఇంధన లభ్యత కొన్ని ప్రధాన మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైంది.


Click it and Unblock the Notifications








