జనవరి నుండి వాహనాల ధరలను పెంచనున్న ఫియట్

అంటే, ప్రస్తుతం ఫియట్ కార్లను కొనుగోలు చేసే వారికి డిస్కౌంట్ లభిస్తుంటే, వచ్చే జనవరిలో ఫియట్ కార్లను కొనుగోలు చేసే వారు అధనంగా తమ జేబులకు చిల్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న కారణంగా లీనియా, పుంటో కార్ల ధరలను జనవరి 1వ తేదీ నుండి 2 శాతం మేర పెంచనున్నామని ఫియట్ ఇండియా పేర్కొంది.
ఇదిలా ఉండగా, వచ్చే జనవరి 3వ తేదీన ఫియట్ గ్రాండే పుంటో, ఫియట్ లీనియా మోడళ్లలో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ 2012 వెర్షన్లను ఫియట్ విడుదల చేయనుంది. ఉత్పత్తుల ధరల పెంపుపై ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








