డిసెంబర్ 14న మార్కెట్లోకి రానున్న 2012 హోండా సిటీ!

సరికొత్త ఫేస్‌లిఫ్ట్ 2012 హోండా సిటీ, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా సిటీ సెడాన్ కన్నా కాస్తంత విభిన్నంగానూ, కొత్తగానూ ఉండనుంది. ఇందులో ఎన్నో సాంకేతిక, బాహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే ఇంజన్, పెర్ఫామెన్స్‌ల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఫేస్‌లిఫ్ట్ హోండా సిటీ సెడాన్‌ను కంపెనీ ఇప్పటికే థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది.
హోండా సిటీలో ప్రస్తుతం డీజిల్ వేరియంట్ లభిస్తుండకపోవటంతో, కొత్త హోండా సిటీపై కంపెనీ పెద్దగా పెట్టుబడి పెట్టాలని భావించడం లేదని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ, కొత్త 2012 హోండా సిటీ ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్‌లలో కొద్దిపాటి మార్పులతో మరింత ఆకర్షణీయమైన ప్రీమియం లుక్‌తో ఇది లభ్యం కానుంది. ధర విషయానికి వచ్చే సరికి ప్రస్తుతం ఉన్న హోండా సిటీ కన్నా ఇది కాస్తంత అధికంగానే ఉండొచ్చని అంచనా.
హోండా సియోల్ కార్స్ ఇండియా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ అయిన సిటీలో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయనుందని గతంలో తెలుగు డ్రైవ్ స్పార్క్ విభిన్న కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న పాత హోండా సిటీ సెడాన్ ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసిన విషయం తెలిసినదే.


Click it and Unblock the Notifications








