సరికొత్త 2012 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఆవిష్కరణ

కాగా, ప్రస్తుతం సుజుకి ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో విడుదల చేసిన 2012 స్విఫ్ట్ స్పోర్ట్‌లో డిజైన్ మరియు ఫీచర్లలో అనేక మార్పులను చేశారు. రెండు డోర్లు మాత్రమే కలిగిన ఈ స్విఫ్ట్ స్పోర్ట్‌లో పెద్ద ఫాగ్ ల్యాంప్స్, శక్తివంతమైన హెడ్‌ల్యాంప్స్, మెటాలిక్ గ్రే కోటింగ్, తక్కువ బరువు కలిగిన పెద్ద 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సరికొత్త గ్రిల్, ఆకర్షనీయమైన ఏరోడైనమిక్స్ వంటి మార్పులు చేర్పులు చేశారు.
ఈ కారు లోపలి భాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పోర్టీ సీట్స్, ఫైవ్-డయల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్‌తో పాటుగా మరెన్నో అత్యాధునిక మరియు అదనపు ఫీచర్లను జోడించారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే.. ఇంజన్ పెర్ఫామెన్స్. కొత్త స్విఫ్ట్ స్పోర్ట్ ఇంజన్ 134 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఇది వరకటి వేరియంట్ 123 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది.
అలాగే టార్క్ విషయంలో కూడా పాత వేరియంట్ కన్నా అధికంగా ఉంటుంది. పాత వేరియంట్ స్విఫ్ట్ స్పోర్ట్ 109lb-ftల టార్క్‌ను విడుదల చేస్తే, ప్రస్తుతం మార్కెట్లోకి రానున్న కొత్త స్విఫ్ట్ స్పోర్ట్ 118lb-ftల టార్క్‌ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా ఇది తక్కువ కర్భన వ్యర్థాలు విడుదల చేస్తుంది. ఏవిధంగా చూసినా పాత వేరియంట్ స్విఫ్ట్ స్పోర్ట్ కన్నా 2012 స్విఫ్ట్ స్పోర్ట్ ది బెస్ట్ అనిపించుకోనుంది. మన దేశంలో కూడా ఈ కారును త్వరగా విడుదల చేయాలని సుజుకిని కోరుకుందాం..!!


Click it and Unblock the Notifications








