టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి అదనపు మెరుగులు

టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి భారత మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఒకానొక సమయంలో ఈ మోడల్‌కు ఆర్డర్లు భారీగా వస్తుండటంతో రెండుసార్లు కంపెనీ బుకింగ్‌లను నిలిపివేసింది. కాగా.. ప్రస్తుతం ఫేస్‌లిఫ్ట్ 2012 టొయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ కొత్త మోడల్‌ను ఇప్పటికే ఇండోనేషియా, గల్ఫ్ మార్కెట్లలో కంపెనీ అమ్మకానికి ఉంచింది.
సరికొత్త 2012 టొయాటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ ఇంజన్‌లో ఎలాంటి యాంత్రిక మార్పులు లేకుండా, ఇంటీరియర్ ఎక్స్‌టీరియర్స్‌లలో కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు చేయబడింది. సరికొత్త క్రోమ్ గ్రిల్, ఆకర్షనీయమైన లైసెన్స్ ప్లేట్, సిలిండర్ ప్రొజెక్టర్ ల్యాంప్స్, బ్లాక్ వుడ్ గ్రెయిన్ ప్యానెల్ ఇంటీరియర్స్ వంటి మరెన్నో మార్పులు ఇందులో చేశారు. దీని ఇంటీరియర్స్ టొయోటా అందిస్తున్న లగ్జరీ కార్లయిన ప్రాడో, ల్యాండ్ క్రూజర్ మోడళ్లను తలపిస్తాయి.
వెనుకవైపు మరింత విశాలమైన సీట్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం టొయోటా ఫార్చ్యూనర్ రెండు పెట్రోల్ ఇంజన్‌లు, ఒక టర్బో ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ప్రీమియం వెర్షన్‌లో 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఎక్స్‌క్లూజివ్ వెర్షన్‌లో 4.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. గ్రాండ్ వెర్షన్‌లో 4.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ మూడు ఇంజన్లు కూడా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభ్యమవుతాయి.


Click it and Unblock the Notifications








