ఎతియోస్ కార్లలో సమస్యలు: టొయోటా సర్వీస్ క్యాంప్

తాజాగా.. టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ భారత్‌లో విక్రయించిన ఎతియోస్, ఎతియోస్ లివా ఫిల్లర్ హోస్‌లో సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ సమస్యను సరిచేసేందుకు కంపెనీ రీకాల్‌ను ప్రకటించింది. ఈ ఫిల్లర్ హోస్ లోపం కారణంగా, ఎతియోస్, లివా కార్లలో మరిన్ని సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని, ఈ కార్లలో తక్షణమే ఈ ఫిల్లర్ హోస్‌ను రీప్లేస్ చేయాలని కంపెనీ తన అధికారిక ఫేస్‌బుక్‌లో పేర్కొంది.
అక్టోబర్ 8, 2011 వరకూ తయారైన టొయోటా ఎతియోస్, ఎతియోస్ లివా కార్లలో ఫిల్లర్ హోస్ సమస్య ఉందని, "వినియోగదారులే ముందు" అన్న తమ సిద్ధాంతంలో భాగంగా ప్రస్తుతం ఓ ప్రత్యేక సర్వీస్ క్యాంపైన్‌ను నిర్వహిస్తున్నామని, ఈ విషయానికి సంబంధించి తమ సమీపంలో టొయోటా డీలర్లను సంప్రదించవచ్చని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రకటించింది. ఈ సమస్యను సరిచేయడానికి 45 నిమిషాల సమయం పడుతుందని, దీన్ని ఉచితంగా చేయడం జరుగుతుంజని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








