హైబ్రిడ్ వెర్షన్ ట్రావెలర్‌ను లాంచ్ చేయనున్న ఫోర్స్ మోటార్స్

మీ అందరికీ "టెంపో ట్రావెలర్" గుర్తుండే ఉంటుంది. ఎంతో ప్రజల రవాణా అవసరాలను తీరుస్తున్న ఈ టెంపో ట్రావెలర్ త్వరలోనే మరో కొత్త అవతారం దాల్చనుంది. ప్రముఖ వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ అందిస్తున్న ట్రావెలర్‌లో ఓ సరికొత్త హైబ్రిడ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. రానున్న జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కారను ప్రదర్శించనుంది.

వచ్చే ఏడాది చివరి నాటికి ఈ హైబ్రిడ్ ట్రావెలర్‌ను వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సిఎన్‌జీ వేరియంట్ ట్రావెలర్‌ను అలాగే, ప్రస్తుతం జర్మన్ ఆటో దిగ్గజం డైమ్లర్ లైసెన్స్‌తో అభివృద్ధి చేస్తున్న ఓ 9-సీటర్ మల్టీ పర్పస్ వాహనాన్ని (ఎమ్‌పివి)ని కూడా విడుదల చేయనున్నామని ఫోర్స్ మోటార్స్ వెల్లడించింది. దీని ధర రూ. 12.15 లక్షల మధ్యలో ఉండనుంది.

ఈ విషయంపై ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియా స్పందిస్తూ.. "జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మేము ఓ హైబ్రిడ్ ట్రావెలర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించనున్నాం. ఇది సోలార్ ఎనర్జీతో పాటుగా పునరుత్పాక ఎగ్జాస్ట్ సిస్టమ్‌ల ద్వారా పనిచేస్తుంది. ఏడాది తర్వాత ఈ మోడల్‌ను వాణిజ్యపరంగా విడుదల చేస్తాం. దీన్ని మధ్యప్రదేశ్‌లోని పీతాంపూర్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తామ"ని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, December 23, 2011, 14:55 [IST]
English summary
Force Motors, one of India's leading commercial vehicle manufacturer has announced plans to launch a hybrid version of its top selling van Traveller. The Hybrid Traveller will be displayed first at the forthcoming Delhi Auto Expo and it will be then launched before the end of 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+