నేషనల్ క్వాలిటీ సమిట్‌లో ఫోర్డ్ ఇండియాకు అవార్డులు

తమిళనాడు రాజధాని చెన్నైకు సమీపంలో ఉన్న మరైమలై నగర్‌లోని ఫోర్డ్ ఇండియా చెన్నై ప్లాంట్‌లో నాణ్యతా ప్రమాణాల విభాగం (క్వాలిటీ డిపార్ట్‌మెంట్), బాడీ డిజైనింగ్ విభాగంలో ఉత్తమ ప్రమాణాలు పాటించినందుకు నేషనల్ క్వాలిటీ సమిట్‌లో "ఇండియా క్వాలిటీ సర్కిల్ ఫోరమ్స్ పార్-ఎక్సలెన్స్ అవార్డు"ను సొంతం చేసుకుంది.
హైదరాబాద్‌లో డిసెంబర్ 8-12 వరకూ జరిగిన "న్యాచురల్ వర్క్ గ్రూప్" (ఎన్‌డబ్ల్యూసి)లో క్వాలిటీ రైడర్స్, బాడీ షైనింగ్ పోటీలో టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్, గోద్రేజ్ వంటి 330 తయారీ కంపెనీలు పోటీపడగా ఫోర్డ్‌కు ఈ అవార్డు లభించడం విశేషం. ఈ అరుదైన సత్కారం తమకు ఓ మైలురాయిగా నిలుస్తుందని, ఈ అవార్డుతో తమ సంస్థకు జాతీయస్థాయిలో ఉన్నతస్థాయి గుర్తింపు లభించినట్లయిందని ఫోర్డ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ బోన్‌హామ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








