రూపాయి విలువ పతనం: పెరగనున్న కార్ల ధరలు

Rupee Fall
దోబూచులాడుతున్న రూపాయి మారకపు విలువ ఆటో పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తుంది. వరుసగా పడిపోతూ వస్తున్న రూపాయి విలువ కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీనికితోడు మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఆటోమొబైల్ కంపెనీలను మరింత ఇబ్బందుల్లోకి గురిచేస్తున్నాయి.

ప్రస్తుతం చాలా వరకూ భారత్‌‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆటోమొబైల్ కంపెనీలు ఆటో విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే, క్రమంగా పడిపోతున్న రూపాయి విలు కారణంగా విడిభాగాల ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఈ నేపథ్యంలో మరింత నష్టాల ఊబిలో చిక్కుకోక ముందే ఉత్పత్తుల ధలను పెంచాలని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి.

ఇందులోభాగంగానే జనరల్ మోటార్స్, టోయోటా కిర్లోస్కర్ మోటార్, మారుతి సుజుకి, హోండా సియోల్ కార్స్ ఇండియా వంటి సంస్థలు ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నారు. వాహనాల తయారీలో వినియోగించే ఉక్కు, కాపర్, టైర్ల వంటి వివిధ విడిభాగాలు ధరలు పెరగుతున్నందున వచ్చే జనవరిలో ధరలను పెంచాలని నిర్ణయించామని, కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే.. జనవరి కన్నా ముందుగానే ఉత్పత్తుల ధరలు పెంచాల్సే పరిస్థితి ఏర్పడేలా ఉందని జనరల్ మోటార్స్ ఇండియా ఉపాధ్యక్షుడు పి.బాలేంద్రన్ తెలిపారు.

టోయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జపాన్ కరెన్సీ యెన్ బలపడుతుండటం పట్ల తమ సంస్థ సంతోషంగానే ఉన్నప్పటికీ, పతనమవుతున్న రూపాయి విలువ పట్ల ఆందోళ చెందుతున్నామని చెప్పారు. మారుతి సుజుకి, హోండా సియోల్ కార్స్ కంపెనీలు ఉత్పత్తుల ధరల పెంపుకే సై అంటున్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. వచ్చే ఏడాది నాటికి కార్ల ధరలు మరింత ప్రియం అయ్యే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 23, 2011, 17:48 [IST]
English summary
The drop in value of the Indian Rupee is having a huge impact on the auto industry. Imports are getting more expensive and carmakers dependent on imported parts are facing the brunt of the damage. Carmakers who are already suffering a slowdown in sales are at a catch 22 situation. As the increased import costs is reducing profitability and increasing prices has become inevitable. But increasing prices will further reduce sales that are already low.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+