భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్న పోలారిస్

ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంది.
"ఒక్కసారి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన తర్వాత, అవి ఆన్-రోడ్ లేక ఆఫ్-రోడ్ వాహనాల అనేది నిర్ణయిస్తాము. అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఈ ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, బ్యాటరీ ఇతర సమస్యలు వంటి ఉన్నాయ"ని పోలారిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ దూబే తెలిపారు. ప్రస్తుతం అమెరికా, యూరప్ మార్కెట్లో కోసం జెమ్, బ్రీజ్ అనే ఎలక్ట్రిక్ కార్లను కంపెనీ అభివృద్ధి చేస్తుంది.
పోలారిస్ భారత్‌లో అందిస్తున్న ఆఫ్-రోడ్, ఆల్-టెర్రైన్ వాహనాల ధరల శ్రేణి రూ. 2.4 లక్షలు మొదలుకొని 20 లక్షల (ఢిల్లీ) వరకూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాహనాలను అమెరికా, మెక్సికోలలో ఉన్న పోలారిస్ ప్లాంట్ల నుండి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ)గా దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది.


Click it and Unblock the Notifications








