జనవరిలో మూడు మినీ మోడళ్ల విడుదల: బిఎమ్‌డబ్ల్యూ

BMW Mini
బిఎమ్‌డబ్ల్యూకు చెందిన మినీ బ్రాండ్ కార్లు వచ్చే ఏడాది దేశీయ విపణిలోకి అధికారికంగా ప్రవేశించినున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ప్రతిషాత్మక మినీ బ్రాండ్ నుంచి త్రీ-డోర్ కూపర్ హ్యాచ్, కూపర్ కన్వర్టబిల్, కంట్రీమ్యాన్ ఎస్‌యూవీలు తొలుతగా భారత మార్కెట్‌కు పరిచయం కానున్నాయి. 2012 సంవత్సరం ఆరంభంలో ఈ మూడు మినీ మోడళ్లు భారతీయలకు కనువిందు చేయనున్నాయి.

భారత్‌లో మినీ బ్రాండ్ కార్ల ధరలు, ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న చవక మోడల్ ఎక్స్-1 (రూ.21 లక్షలు) రేంజ్‌లో ఉండనున్నాయి. మినీ బ్రాండ్ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. వచ్చే జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బిఎమ్‌డబ్ల్యూ ఈ మినీ కార్లను విడుదల చేయనుంది. ప్రస్తుతానికి వీటిని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్ ద్వారా కంపెనీ దిగుమతి చేసుకోనుంది.

ఈ మూడు మోడళ్ల విడుదల తర్వాత వీటికి లభించే స్పందనను బట్టి, మినీ బ్రాండ్‌లో రూపొందుతున్న ఇతర మోడళ్లను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. వాస్తవానికి 2009లోనే ఈ మినీ బ్రాండ్ కార్లను భారత్‌లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో మినీ బ్రాండ్ కార్లకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత వీటిని ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది.

More from DriveSpark

Article Published On: Saturday, November 26, 2011, 10:58 [IST]
English summary
BMW India has confirmed the launch of the iconic Mini cars in India sooner that we all expected. BMW India boss Andreas Schhaaf has said Mini cars will be imported within the next two months and two new showrooms for Mini will be established in Delhi and Bombay. The Cooper is expected to be priced around Rs.25 lakhs while the top end Clubman will be priced about Rs.330 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+