తేలికపాటి వాహనాల ఉత్పత్తికి హోండా సన్నాహాలు

Honda N Box
జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్స్ కో నుండి భవిష్యత్తులో రానున్న వాహనాలు డైటింగ్ చేయనున్నాయి. వాహనాలు డైటింగ్ చేయడమేంటి అనుకుంటున్నారా..? మరేం లేదండి.. తేలికపాటి (బరువు తక్కువగా ఉండే) వాహనాలను చయారు చేసేందుకు హోండా ఓ సరికొత్త డిజైన్, అసెంబ్లిగ్ విధానాన్ని అనవలంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జపనీస్ వాణిజ్య వార్తా పత్రిక నిక్కీ పేర్కొంది.

అవుటర్ ప్యానెల్స్, సైడ్ ప్యానెల్స్ మరియు ఇతర ప్యానెల్స్‌ను సీలింగ్‌కు అసెంబ్లింగ్ చేయడానికి బదులు ఫ్రేమ్‌కు వెల్డింగ్ చేయడం, బోల్టులు, రీఇన్‌ఫోర్సింగ్ వస్తువుల వాడకాన్ని తగ్గించడం వంటి పద్ధతులను హోండా తన కొత్త తయారీ విధానంలో ఉపయోగించనున్న సదరు పత్రిక వెల్లడించింది. హోండా జపాన్‌తో పాటుగా విదేశాల్లో కూడా ఉత్పత్తిని అభివృద్ధి చేసేందుకు గానూ 10 బిలియన్ యెన్‌లను ఖర్చు చేయనుంది.

ప్రారంభంలో భాగంగా, హోండా తన చిన్న వాహనాల్లో ఈ కొత్త విధానాలను ఉపయోగించి, తర్వాతి కాలంలో అన్ని మోడళ్లలోనూ దీనిని ఉపయోగించనుంది. ఇటీవలే ముగిసిన టోక్యో మోటార్ షోలో హోండా మోటార్ కో ఆవిష్కరించిన మినీ వెహికల్ "ఎన్ బాక్స్"లో తొలుతగా ఈ కొత్త తయారీ విధానాన్ని ఉపయోగించనున్నట్లు నిక్కీ ప్రచురించింది.

Article Published On: Monday, December 26, 2011, 12:15 [IST]
English summary
Japanese auto major Honda Motor Co plans to adopt new design and assembly methods to make its vehicles lighter, the Nikkei business daily reported.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+