పెట్రో కంపెనీలు కొత్త సంవత్సర కానుక: ధర పెంపు

ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం రూ.52.70 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ నెల 15న కూడా చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను 65 పైసలు పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెట్రోల్ ధరల నియంత్రణ ప్రభుత్వ రంగ చమురు సంస్థల అధీనంలో ఉన్నందున, నెలకు రెండుసార్లు చొప్పున (ప్రతి నెలా 1, 16 తేదీల్లో) ధరలను సమీక్షించి, పెంపు లేదా తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
ఇప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి లీటరు పెట్రోల్ విక్రయంపై 85 పైసలు చొప్పున నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీన సమావేశం కానున్న కంపెనీలు ధరల పెంపు వైపే మొగ్గు చూపే ఆస్కారం ఉంది. న్యూఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.65.64 (ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్)గా ఉంది.


Click it and Unblock the Notifications








