స్టార్టర్ మోటార్స్ రీప్లేస్‌మెంట్ రీకాల్ కాదు: టాటా మోటార్స్

అయితే, ఇలా టాటా నానో కార్లను వెనక్కు పిలిపించడం పట్ల టాటా మోటార్స్ స్పందిస్తూ, ఇది ఎంత మాత్రం రీకాల్ కాదని, ప్రస్తుతం ఉన్న స్టార్టర్ మోటార్ కారణంగా ఏ రకమైన ఫిర్యాదులు తమకు అందలేదని, మెరుగైన స్టార్టర్ మోటార్‌ను అమర్చేందుకు నానో కార్లను వెనక్కు తీసుకుంటున్నామని, సుమారు లక్షా నలభై వేలకు పైగా టాటా నానో కార్లలో కొత్త స్టార్టర్ మోటార్‌ను అమర్చనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ కొత్త స్టార్టర్ మోటార్ రీప్లేస్‌మెంట్ కారణంగా టాటా మోటార్స్‌పై అదనంగా సుమారు రూ.110 కోట్లు భారం పడునుంది. 2009లో విడుదలదైన మొదటి తరం టాటా నానో ఇప్పటి వరకూ మొత్తం 1,40,428 కార్లు అమ్ముడయినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా, కొన్ని సర్వీస్ సెంటర్లు, డీలర్‌షిప్‌లలో స్టార్టర్ మోటార్‌తో పాటుగా, బ్యాటరీ ఫ్యూజ్, ఆల్టర్నేటర్ కేబుల్, యాక్సిలరేటర్ కేబుళ్లను కూడా రీప్లేస్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








