జనవరి నెలలో మరింత ప్రియం కానున్న కార్ల ధరలు

Car Price
రూపాయి మారకపు విలువ పతనం కారణంగా వివిధ మోడల్‌ను బట్టి కార్ల ధరలు రూ.10,000 నుండి రూ.25,000 మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణత కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వివిధ విడిభాగాల ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో ఆటో కంపెనీలు ధరలు పెంచే మార్గం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

మరోవైపు థాయ్‌లాండ్‌లో తలెత్తిన వరదల కారణంగా ఏర్పడి విడిభాగాల కొరత కూడా ఆటో కంపెనీలను వేధిస్తుంది. దీనికితోడు పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఇంధన ధరలు ఆటోమొబైల్ కంపెనీలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి, టొయోటా. జనరల్ మోటార్స్, హోండా, స్కొడా ఆటో వంటి వివిధ కంపెనీలు ధరల పెంపుపై మొగ్గుచూపుతున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో రూపాయి విలువ 17 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. దేశీయ కంపెనీలు చాలా విడి భాగాల కోసం అంతర్జాతీయ మార్కెట్లను ఆశ్రయిస్తుండటంతో, క్షీణించిన రూపాయి విలువ సదరు కంపెనీల మార్జిన్లపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. వచ్చే జనవరి నాటికి దాదాపు అన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే ఆస్కారం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 29, 2011, 12:12 [IST]
English summary
The drop in value of the Indian Rupee is having a huge impact on the auto industry. Imports are getting more expensive and carmakers dependent on imported parts are facing the brunt of the damage. Carmakers who are already suffering a slowdown in sales are at a catch 22 situation. As the increased import costs is reducing profitability and increasing prices has become inevitable. But increasing prices will further reduce sales that are already low.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+