హైదరాబాద్: పారిశ్రామికంగా వెనుబడి ఉన్న తెలంగాణా ప్రాంతంలో వాహన ఉత్పత్తి రంగంలో పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ తయారీ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా మెదక్‌జిల్లాలోని జహీ రాబాద్‌లో ట్రాక్టర్ తయారీ పరిశ్రమను నెలకొల్పు తున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి, ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, సంస్థ ప్రెసిడెంట్ పవన్ గోయెంకా బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.మహీంద్రా అండ్ మహీంద్రా రూ.300 కోట్ల పెట్టుబడితో ట్రాక్టర్ తయారీ పరిశ్రమను నెలకొల్పుతుంది. మరో మూడు సంవత్సరాలలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశా లున్నాయి.
ఈ ప్లాంట్‌లో సుమా రు 2,000 మందికి ప్రత్యక్షంగా నూ, మరో 5,000 మందికి పరో క్షంగానూ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం స్ధాపిస్తున్న సంస్థతో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ దక్షిణభారత దేశంలో నెలకొల్పుతున్న తొలి ప్లాంట్‌గా చెప్పు కోవచ్చు. ఇక్కడ సంవత్సరానికి 90, 000 వరకు ట్రాక్టర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే ప్లాంట్‌లో ట్రాక్టర్లతో పాటు 3 వీలర్స్, 4 వీలర్ వాహనాలను కూడా ఉత్పత్తి చేయనున్నారు.