ఐదు కొత్త మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టనున్న రీనాల్ట్

Renault
ఎట్టకేలకు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ "రీనాల్ట్" భారత కార్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యింది. ఇండియా మార్కెట్లో తమ ఉత్పత్తులు ప్రవేశపెట్టాలన్న రీనాల్ట్ కల త్వరలోనే నిజం కాబోతుంది. వచ్చే ఏడాది ఐదు కొత్త మోడళ్లతో రీనాల్ట్ భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం తమిళనాడులోని చెన్నయ్ నగరంలో ఓ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు గానూ రీనాల్ట్ దాదాపు రూ. 4,500 కోట్లను పెట్టుబడులగా వెచ్చించనుంది. తమ జపాన్ భాగస్వామి నిస్సాన్ మోటార్ కంపెనీతో కలిసి రీనాల్ట్ ఈ ప్లాంటును స్థాపించనున్నట్లు పేర్కొంది.

ఏడాదికి నాలుగు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంలో ఈ ప్లాంటును నిర్మించనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. రానున్న ఐదేళ్లపాటు వార్షికంగా 70,000 కార్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని రీనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్క నాసిఫ్ పేర్కొన్నారు. ఈ ఐదు మోడళ్లలో మొదటి దానిని ఈ ఏడాది మధ్యభాగంలో విడుదల చేస్తామని, రష్యా, బ్రెజిల్ మార్కెట్ల మాదిరిగానే భారత మార్కెట్ కూడా తమకు ఎంతో పటిష్టమైనదని ఆయన తెలిపారు. ఈ మోడల్ తర్వాత హై-ఎండ్ కాంపాక్ట్ ఎస్‌యూవి కారు 'కొలియోస్'ను విడుదల చేయనున్నామని మార్కె పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, February 25, 2011, 11:03 [IST]
English summary
Within the next year there will be five new models from Renault in the Indian market as the company is shelling Rs4500 crore for erecting the manufacturing plant near Chennai. The plant is in the offing with the JV from Nissan and the target for the coming five years will be 70000 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+