మానేసర్ ప్లాంటు సమ్మెలో పాల్గొననున్న 65 యూనియన్లు

Strike at Maruti Manesar Plant
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కార్మికుల చేస్తున్న సమ్మె నేటితో 10వ రోజుకు చేరుకుంది. మానేసర్ ప్లాంటులో కొత్తగా యూనియన్‌ను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం సముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ కార్మికుల మాత్రం తమ సమ్మెను విరమించలేదు. దీనికితోడుగా, విధుల నుంచి తొలగించిన 11 మంది కార్మికులను తిరిగి పనిలోకి చేర్చుకుంటేనే సమ్మె విరమిస్తామని వర్కర్లు కొత్త డిమాండును చేర్చారు. ఇదిలా ఉంటే మారుతి సమ్మె ఇతర ఫ్యాక్టరీలపై కూడా ప్రభావం చూపుతోంది. గుర్గావ్ మరియు దరుహెరా ప్రాంతానికి వివిధ యూనియన్లు మారుతి వర్కర్లకు మద్దతు పలకనున్నాయి. దాదాపు 50-60 పారిశ్రామిక సంస్థలకు చెందిన వర్కర్లు మరియు సుమారు 65 యూనియన్లు మానేసర్ కార్మికులకు అండగా నిలవనున్నారు.

సమ్మె నేపథ్యంలో వర్కర్లకు యాజమాన్ని మధ్య సయోధ్య కుదిర్చేందుకు హర్యాన రాష్ట్ర కార్మిక మంత్రి శివ్ చరణ్ చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. అయితే కంపెనీ మాత్రం తొలిగించిన ఉద్యోగులను తిరిగి వెనక్కు తీసుకునే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. వీరిలో కేవలం ఐదు మందిని మాత్రమే విధుల్లోకి చేర్చుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. కానీ శ్రామికులు మాత్రం ఉద్యోగులందరీని విధుల్లోకి తీసుకొని, వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమని కంపెనీ తమకు రాతపూర్వకంగా తెలిపితేనే సమ్మె ముగిస్తామని చెబుతున్నారు. సమ్మె ఫలితంగా దేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల కంపెనీకు ఇప్పటివరకూ దాదాపు రూ. 400 కోట్లకుపైగా నష్టం వాటిళ్లినట్లు అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, June 13, 2011, 12:05 [IST]
English summary
Nearly 65 unions from various companies and workers from 50-60 industrial units that do not have unions have decided to join the strike at Maruti Suzuki's Manesar plant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+