కోట్లు విలువ చేసే కారు ద్వంసం చేసుకున్న యజమాని

ఇంజన్ లోపాన్ని సరిచేసే సమయంలో కారు బంపర్, ఛాస్సిస్‌లు కొద్దగా డ్యామేజ్ అయ్యాయి. అస్సలే ముచ్చటపడి కోట్లు వెచ్చించి కొన్న కారాయే. లోపం సరికాకపోగా.. కొత్త సమస్య తలెత్తడంతో చిర్రెత్తిన సదరు కారు యజమాని లాంబోర్గిని కంపెనీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఈ విషయంపై కంపెనీ స్పందన నచ్చకపోవడంతో కోట్లు విలువ చేసే గల్లార్డో కారును పబ్లిక్‌గా కూలీ మనుషులను పెట్టించి బలమైన సుత్తులతో పచ్చడి పచ్చడి చేయించి కంపెనీ పట్ల తన నిరసన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలను చైనా టెలివిజన్ ఛానెల్ ప్రచారం చేసింది.
గతంలో జరిగిన ఇలాంటి మరికొన్ని సంఘటనలు పరిశీలిస్తే...
90వ శతాబ్దంలో స్కాట్‌ల్యాండ్‌లో కెఎల్ఎఫ్ కంపెనీ ఆగస్టు, 1994లో పది లక్షల యూరోలు (దాదాపు రూ. 63030793.6) నగదను కుప్పగా పోసి తగులబెట్టారు. అయితే ఇలా ఎందుకు చేశారో వాళ్లు వివరించేలేదు కానీ తర్వాత డబ్బు అంటే తమకు ఇష్టం లేదని అందుకే ఇలా చేశామని చెప్పారట.
మార్చి 19984లో ఓ ఫ్రెంచ్ గాయకుడు సెర్గ్ గెయిన్స్‌బర్గ్ ప్రభుత్వ ట్యాక్స్ విధానాలకు నిరసనగా ఓ టివి ఛానెళ్లో 500-ఫ్రాంక్ నోట్లను తగులబెట్టాడు.
మార్చి 2008లో బ్రిటన్‌కు చెందిన గ్యారీ హూలే అనే వ్యక్తి 3,50,000 యూరోల (దాదాపు రూ. 22060777.8) ఖరీదు చేసే ఇంటిని తగులబెట్టేశాడు. తన మాజీ ప్రియురాలికి ఆ ఇళ్లు దక్కకూడదనే ఉద్దేశంతో అతను ఈ పనిచేశాడట.
తాజాగా.. ఫిబ్రవరి 2010లో అమెరికాలోని ఓహియో ప్రాంతానికి చెందిన టెర్రీ హాకిన్స్ ఓ వ్యక్తి 2,20,000 యూరోల (దాదాపు రూ. 13866774.6) విలువ చేసే తన స్వంత ఇంటినే బుల్డోజర్లతో కూలగొట్టించేశాడు. బ్యాంకు వాళ్లు ఆ ఇంటిని ఆక్రమించుకోకుండా ఉండాలనే తాను ఈ పనిచేశాడట.


Click it and Unblock the Notifications








