రీనాల్ట్ నుంచి సరికొత్త కాన్సెప్ట్ కార్ 'కాప్టర్'

సీతాకోక చిలుక రెక్కల్లా విచ్చుకునే డోర్లు, అవసరం లేదనుకున్నప్పుడు తొలగించుకోవడానికి వీలుగా ఉండే కన్వర్టబుల్ టాప్, విశాలమైన టైర్లు (బ్లాక్ అండ్ వైట్ రిమ్) దీని అదనపు ప్రత్యేకతలు. దీని సెంటర్ కన్సోల్, డాష్ బోర్డ్, డోర్ కేసింగ్‌ల డిజైన్‌లో అపారదర్శక పదార్థాలను డిజైనర్లు ఉపయోగించారు. ఇక దీని సాంకేతిక పరిజ్ఞానానికి వస్తే.. ఇది డిసిఐ 160 ట్విన్ టర్బో ఇంజన్‌తో పనిచేస్తుంది. అధిక ఇంధన సామర్థ్యం, డ్యూయెల్ క్లచ్ ఈడిసి గేర్‌బాక్స్, సెల్ఫ్ లాక్ వంటి అత్యాధునిక సదుపాయాలు కూడా ఈ కారులో ఉన్నాయి. అయితే ఈ కారు ధరను కానీ, మార్కెట్లో అధికార విడుదలకు సంబంధించిన వివరాలను కానీ.. కంపెనీ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications