ఇంధన ధరలు నానాటికీ పెరిగిపోతుండటంతో భూమిలోని శిలాజ ఇంధనాలు త్వరలోనే అంతరించిపోయే అవకాశం ఉంది. భావితరాలు, భవిష్యత్తు అవసరాల కోసం ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా పరిమితంగా ఉన్న సహజవనరులను సంరక్షించుకోవాలంటే ఇంధనాన్ని ఆదా చేసుకోక తప్పదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైన రసాయనాలను తయారు చేసే కంపెనీ లాంక్సెస్ 30 శాతం వరకూ ఇంధనాన్ని ఆదా చేసే రబ్బరును రూపొందించింది. టైర్ల తయారీలో ఈ సింథటిక్ రబ్బరును ఉపయోగిస్తే ఇంధనం ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. బుటైల్ రబ్బర్ (ఐఐఆర్), మోడిఫైడ్ సొల్యూషన్ స్టిర్నెబుటాడైనె రబ్బర్ (ఎస్‌ఎస్‌బీఆర్), అడ్వాన్స్‌డ్ నియోడైమియమ్-పొలిబుటాడీనే రబ్బర్ (ఎన్‌డీ-బీఆర్) వంటి కొత్త గ్రేడ్ రబ్బర్‌లను ఈ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.