సౌత్ ఆఫ్రికాలో సందడి చేయనున్న సోనాలికా గ్రూపు

తూర్పు ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికాలలో ప్రాంతీయ అసెంబ్లింగ్ హబ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇందుకోసం దేశాలు, ప్రదేశాలను ఖరారు చేసే పనిలో ఉన్నామని, మరో మూడు నెలల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఐటిఎల్ అధ్యక్షుడు (అంతర్జాతీయ వ్యాపారాల) రాదీవ్ వాహి వెల్లడించారు. రెండు ప్రతిపాదిత అసెంబ్లింగ్ ప్లాంట్ల కోసం.. తూర్పు ప్రాంతంలో టాంజానియా, కెన్యా మరియు దక్షిణ ప్రాంతంలో మొజాంబిక్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలను గుర్తించామని ఆయన తెలిపారు. సింగిల్ షిఫ్ట్ బేసిస్ ప్రకారం.. ఏడాదికి 2,000 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, అవసరమైతే సెకండ్ షిఫ్ట్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే విధంగా వీటిని రూపొందించనున్నట్లు రాజీవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








