అప్పుడు చైనా మొబైల్స్, ఇప్పుడు చైనా ఆటోమొబైల్స్..!

అసలు విషయం ఏంటంటే.. అమెరికాకు చెందిన ప్రపంచపు అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ 'జనరల్ మోటార్స్' చైనా వాళ్లు తయారుచేసిన కార్లను భారత్‌లో తమ బ్రాండ్ పేరుతో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మరి ఇందులో విశేషం ఏంటంటారా..? విశేషం ఉంది, అదేంటంటే కారేమో మేడ్ ఇన్ చైనా, ఇంజనేమో మేడ్ ఇన్ ఇటలీ మరి బ్రాండ్ పేరేమో మేడ్ ఇన్ అమెరికా. మూడు విభిన్న దేశాలకు చెందిన ఈ కార్లను చివరిగా వినియోగించబోయేది భారతీయులు. జనరల్ మోటార్స్ (జిఎమ్) ఇప్పటే చైనాకు చెందిన షాంగై ఆటోమొబైల్ ఇన్వెస్టిమెంట్ కార్పోరేషన్ (ఎస్ఏఐసి)లో గతేడాది 650 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా వెచ్చించి జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది.
ఈ జేవీ నుంచి భారత్‌లో ఐదు చైనీస్ ఉత్పత్తులు రానున్నాయి. అందులో రెండు వ్యాన్‌లను, రెండు కార్లను మరొక తేలిక వాణిజ్య వాహణాలను (లైట్ కమర్షియల్ వెహికల్) జనరల్ మోటార్స్ పరిచయం చేయనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చైనా కార్లు లోకల్ బ్రాండ్ నేమ్‌తో చెవర్లే లోగోతో పాటు ఫియట్ ఇంజన్‌లను కలిగి ఉంటాయి. ఇప్పటికే చైనా మొబైల్ ఫోన్లతో మన దేశంలో మొబైల్ మార్కెట్లో సరికొత్త సంచనాలనుక తెరలేపిన చైనా దేశం ఇప్పుడు తమ ఆటోమొబైల్స్‌తో మరెన్ని సంచలనాలు సృష్టించనుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications