మారుతి తర్వాత గుజరాత్‌లో కాలుమోపనున్న ఫోర్డ్..!

Gujarat
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కార్ పారిశ్రామిక రంగం పట్ల అనుసరిస్తున్న విధానాలు యావత్ ఆటో రంగాన్ని ఆ రాష్ట్రం వైపు తిప్పుకుంటున్నాయి. ఆటో పరిశ్రమల యాజమాన్యానికి మరియు శ్రామికులకు మధ్య సహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచడంలో గుజరాత్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ యావత్‌ పారిశ్రామిక రంగం ప్రశంసలనందుకుంటోంది. ఈ క్రమంలోనే గుజరాత్‌లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వివిధ ఆటోమొబైల్ కంపెనీలు ఆ రాష్ట్రం వైపుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా గుజరాత్ ఆకర్షణకు లొంగిపోగా తాజా అమెరికాకు చెందిన ప్రపంచపు నాలుగో అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ కూడా మోడీ రాష్ట్రంపై మక్కువ చూపుతోంది.

డెట్రాయిట్‌కు చెందిన ఫోర్డ్ పూర్తి భారతీయ అనుబంధ సంస్థ ఫోర్డ్ ఇండియా గుజరాత్ రాష్ట్రంలో రూ. 5,000 కోట్లను పెట్టుబడిగా వెచ్చించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఏటా మూడు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ఓ ప్లాంటును గుజరాత్‌లో ఫోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఫోర్డ్ కూడా మారుతి మాదిరిగానే టాటా మోటార్స్ ఉత్పత్తి చేస్తున్న బుజ్జి కారు నానో ప్లాంటు పక్కనే స్థలం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మారుతి కూడా సనంద్ ప్లాంటు సమీపంలో 500 ఎకరాల స్థలాన్ని ఖరారు చేసినట్లు కూడా వార్తాలు ఉన్నాయి.

కాగా.. ఫోర్డ్ ఇండియా కంపెనీ కోసం టాటా నానో కారును ఉత్పత్తి చేస్తున్న ప్లాంటుకు సమీపంలోనే 400 ఎకరాల స్థలాన్ని గుజరాత్ ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. మరో 100 ఎకరాల స్థలాన్ని విడిభాగాల యూనిట్ కోసం కేటాయించనుంది. అయితే ఈ విషయంపై స్పందించేకు అటు ఫోర్డ్ కంపెనీ ఇటు ప్రభుత్వం పెదవులు విప్పడం లేదు. ఈ డెవలప్‌మెంట్‌కు సంబంధం ఉన్న వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలలో కంపెనీ తమ కొత్త ప్లాంటుపై ఓ అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఫోర్డ్ ఇప్పటికే చెన్నయ్‌కు 45 కి.మీ. దూరంలో మరైమలై వద్ద రూ. 1,700 కోట్ల పెట్టుబడితో గరిష్టంగా ఏటా రెండు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే ఓ ప్లాంటును నిర్వహిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 8, 2011, 17:46 [IST]
English summary
Detroit based auto maker Ford's fully Indian subsidiary Ford India is planning to step into Gujarat . After Maruti Suzuki, Ford India plans to invest Rs 5,000 crore to set up a plant with the initial capacity of three lakh units per annum.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+