నానో తర్వాత నేపాల్‌కు వెళ్లనున్న హోండా బ్రయో

ప్రస్తుతం కంపెనీ బ్రయో కారును భారత్‌లోని ఉత్పత్తి కేంద్రంలో తయారు చేస్తుంది. బ్రయో ఉత్పత్తి కావాల్సిన విడిభాగాలలో దాదాపు 80 శాతం భారత్‌లోనే కొనుగోలు చేస్తున్నామని, సమీప భవిష్యత్తులో దీన్ని 90 శాతానికి తీసుకువస్తామని హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ సేకీ ఇనాబా తెలిపారు. బ్రయో కారు ఉత్పత్తిని ఎక్కువ భాగం లోకలైజేషన్ చేయడం ద్వారా దీని ధర కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు.
అయితే, ఇప్పటికే ఈ కారును తక్కువ ధరతో ప్రవేశపెట్టడం వలన ఇప్పట్లో ఈ కారు ధరలను తగ్గించే యోచనలో లేమని ఇనాబా తెలిపారు. మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, ఫోర్డ్ ఫిగో, హ్యుందాయ్ ఐ10, ఐ20, చెవర్లే బీట్ వంటి చిన్న కార్లతో తమ బ్రయో కారు పోటీపడనుంది. హోండా కార్లను మరింత ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గానూ త్వరలోనే మరిన్ని డీలర్‌షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








