పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం టొయటా బాటలోనే హోండా, నిస్సాన్

ఇదే తరుణంలో జపాన్ సునామీ తాకిడి భారీగా నష్టపోయిన నిస్సాన్, హోండా కంపెనీలు కూడా ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. జపాన్ నెంబర్ 2 కార్ మేకర్ అయిన నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ ఉద్యోగులు ఉత్పత్తిని యధాస్థితికి తీసుకువచ్చేందుకు అవిరామ కృషితో, ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని నిస్సాన్-జపాన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్లోస్ ఘోస్న్ చెప్పారు. వాస్తవానికి కంపెనీ పూర్తిస్థాయి ఉత్పత్తికి అక్టోబర్ నెలను టార్గెట్‌గా పెట్టుకున్నామని, అయితే అక్టోబర్ కన్నా ముందుగానే ఈ లక్ష్యాన్ని ఛేధించేందుకు కంపెనీలోని ప్రతి ఒక్క ఉద్యోగి శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు.
అలాగే.. భూకంపం కారణంగా ఉత్పత్తిని నష్టపోతున్న హోండా మోటార్స్ కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సన్నాహాలు ప్రారంభించింది. సాధారణ స్థాయి ఉత్పత్తిని రాబట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని, దానికి అనుగుణంగా షెడ్యూల్‌లను రూపొందిస్తున్నామని, కానీ ఇది విడిభాగాల సరఫరాపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని హోండా-జపాన్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఫ్యుమిహికో అన్నారు. అయితే ప్రస్తుతం విడిభాగాల సరఫరా మెరుగుపడినట్లు ఆయన తెలిపారు. భారత్‌లో హోండా సియోల్ కార్స్ ఇండియా 50 శాతం ఉత్పత్తి తగ్గించి ప్లాంట్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








