ఎయిర్‌టెల్ గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఇండియా టికెట్ల అమ్మకం ప్రారంభం

ఈ రేసింగ్ షోకు టికెట్ల శ్రేణి రూ. 2,500 నుండి ప్రారంభమై 35,000 వరకూ ఉన్నాయి. బుకింగ్‌లు ప్రారంభమైన తొలి రోజు మొదటి 100 నిమిషాల్లోనే దాదాపు 1,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఈవెంట్‌కు బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ మొత్తం లక్ష మందికి ఆతిథ్యమిచ్చే విధంగా సీటింగ్ కెపాసిటీ ఉంది. కాగా.. భారతదేశంలోనే ఇది తొలి గ్రాండ్ ప్రిక్స్ కావడం విశేషం. ఈ కార్యక్రమానికి టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.


Click it and Unblock the Notifications








