అశోక్ లేలాండ్-నిస్సాన్‌ల జేవీ నుంచి తొలి ఎల్‌సీవీ 'దోస్త్'

AL Dost
హిందుజా గ్రూప్‌ చెందిన ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అశోక్‌ లేలాండ్‌ మరియు జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం నిస్సాన్‌ మోటార్‌ కంపెనీలు కలిసి సంయుక్తంగా రూపొందించిన తొలి లైట్‌ కమర్షియల్‌ వెహికల్‌ (ఎల్‌సీవీ)ను ఈ జాయింట్ వెంచర్ మార్కెట్లోకి విడుదల చేసింది. 'అశోక్ లేలాండ్ దోస్త్" పేరుతో ఓ చిన్నతరహా వాణిజ్య వాహనాన్ని విడుదల చేశారు. 55 హెచ్‌పి హై టార్క్‌, 3 సిలిండర్‌ టర్బో చార్జ్‌ రైల్‌ డీజల్‌ ఇంజన్‌ సామర్థ్యం కలిగిన ఈ వాహనం 1.25 టన్నుల పేలోడ్‌ను సునాయసంగా తరలించగలదని హిందుజా ఆటోమోటివ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ వి సుమంత్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

'దోస్త్‌' బ్రాండ్‌ పేరిట విడుదలైన ఈ వేరియంట్‌ బిఎస్‌-3, 4 వర్షన్‌లలో లభిస్తుందని తెలిపారు. ఈ జేవీ నుంచి తయారైన వాహనాలను విక్రయించడానికి త్వరలో 25 మంది ఎక్స్‌క్లూజివ్ డీలర్లను నియమించనున్నామని పేర్కొంది. అక్టోబర్ 2007లో అశోక్ లేలాండ్, నిస్సాన్ కంపెనీలు మాస్టర్-కోపరేషన్ అగ్రిమెంట్ ద్వారా జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. ఇందుకోసం ఇరు కంపెనీలు రూ. 2,300 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించాయి. కాగా.. అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం ఈ జేవీ నుంచి వస్తోన్న తొలి ఎల్‌సీవీ కావడం విశేషం.

More from DriveSpark

Article Published On: Wednesday, March 30, 2011, 10:12 [IST]
English summary
Ashok Leyland and Nissan Motor Company's JV has rolled out their first Light Commercial Vehicle under the brand, "Ashok Leyland - DOST". Ashok Leyland - DOST is pick-up truck with the pay load capacity of 1.25 tonne.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+