ఇండో-ఓవర్‌సీస్ టెక్నో వెంచర్ అయిన హ్యారిసన్ మోటార్స్ కంపెనీ భారత మార్కెట్లో ఆల్ టెర్రైన్ వాహనాలను (ఏటివి) ప్రవేశపెట్టింది. నాలుగు చక్రాలు కలిగి ఉండి బైక్ తరహాలో ఉండే ఈ ఆల్ టెర్రైన్ వాహనాలను 50 సీసీ నుంచి 20 సీసీ వరకూ కలిగిన వివిధ మోడళ్లను కంపెనీ పూణే మార్కెట్లో విడుదల చేసింది. ఫంటీ బ్రాండ్‌లో అందిస్తున్న ఈ ఏటివిలలో 50సీసీ విజ్ జూనియర్, 110సీసీ స్ట్రైకర్, 150సీసీ ఫైటర్, 200సీసీ టెర్మినేటర్ వాహనాలను కంపెనీ విడుదల చేసింది.
ఈ వాహనాలను సరదా రైడ్ కోసం, ఆఫ్ రోడ్ ప్రయోజనాల కోసం, రవాణా మరియు అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటి పలు విభాగాల్లో వాడుకోవచ్చు. అంతేకాకుండా బీచ్‌లు, కొండ ప్రాంతాలు, ఇసుక ప్రదేశాలలో నివసించే ప్రజలు తమ రెగ్యులర్ కమ్యూటర్ వాహనంగా కూడా దీన్ని వాడుకోవచ్చు. మార్కెట్లో వీటి ధరలు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకూ ఉన్నాయి.