ఆల్టోకి పోటీగా జీఎమ్-ఎస్ఏఐసీల నుంచి మరో చిన్నకారు

మార్కెట్లో ఆల్టో కారుకు ఉన్న ప్రాచుర్యాన్ని, అది సాధించిన ఘనత పట్ల తమకు అవగాహన ఉందని, ఆల్టో స్థాయిలో ఓ చిన్నకారును రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ కారు కనుక తుదిరూపం దాల్చితే దాని ధర జనరల్ మోటార్స్ అందిస్తున్న ప్రారంభ మోడల్ "స్పార్క్" కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా.. చిన్నకార్ల మార్కెట్లో మారుతి నుంచి పోటీ ఎదుర్కునే హోండా, టాటా, హ్యుందాయ్ వంటి కంపెనీల సరసన జనరల్ మోటార్స్ కూడా ఒకటిగా నిలువనుంది.
జనరల్ మోటార్స్ భారత్‌లో 1997 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తూ.. పలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ వస్తున్నప్పటికీ.. వనరుల కేటాయింపులో కొన్ని లోపాల వల్ల దేశంలో పటిష్టమైన మార్కెట్‌ను సంపాదించులేకపోయింది. జీఎమ్‌కు భారత మార్కెట్లో కేవలం 4.6 శాతం మాత్రమే మార్కెట్ వాటా ఉంది. అయితే గతంలో దొర్లిన తప్పులు మరోసారి జరగకుండా జాగ్రత్త వహిస్తామని కంపెనీ అధ్యక్షుడు హమీ ఇచ్చారు. జీఎమ్‌కు భారత్ ఓ కీలక మార్కెట్ అని ఆయన పేర్కొన్నారు.
గతేడాది (2010)లో జనరల్ మోటార్స్ విక్రయాలు 1,10,804 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం (2009)లో ఇవి కేవలం 69,579 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతేకాకుండా.. రానున్న రెండేళ్లలో కంపెనీ మరో ఆరు కొత్త మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇందులో రెండు తేలికపాటి వాణిజ్య వాహనాల (లైట్ కమర్షియల్ వెహికల్)ను, మిగిలిన నాలుగు ప్యాసింజర్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








