వినియగదారులను సంతృప్తిపరచడంలో నానో లాస్ట్..!!

Tata Nano
టాటా మోటార్స్ బుజ్జి కారు "టాటా నానో" వినియోగాదారులను సంతృప్తిపరచడంలో చివరి స్థానాన్ని ఆక్రమించింది. 2010లో ఫోర్-వీలర్ విభాగంలో మొత్తం వినియోగదారుల సంతృప్తి (టోటల్ కస్టమర్ శాటిస్‌ఫ్యాక్షన్)పై జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 'టిఎన్ఎస్ ఆటోమోటివ్' ప్రారంభ స్థాయి (ఎంట్రీ లెవల్) మోడల్ కార్లపై జరిపిన ఓ అధ్యయనలో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు అయిన మారుతి సుజికి ఇండియా (ఎమ్ఎస్ఐ) ముద్దుల కారు "ఆల్టో" వినియోగదారులను సంతృప్తి పరచడంలో అగ్రస్థానంలో నిలవగా.. ప్రజల కారు నానో చివరి స్థానానికి పడిపోయినట్లు తేలింది.

ఆల్టో తర్వాతి స్థానాలలో ఓమ్ని, ఒకప్పటి స్టేటస్ సింబల్ అయిన మారుతి 800లు నిలిచాయి. ఈ సర్వేలో నానో యజమానులు మరింత మెరుగైన డిజైన్‌ను ఆశిస్తుండగా... మారుతి 800 యజమానులు మరింత మెరుగైన సేవలను ఆశిస్తున్నట్లు తేలింది. 2009లో విడుదలైన టాటా నానో పలు ప్రాంతాల్లో ఇంజన్ లోపం కారణంగా మంటల్లో కాలి బూడిదైనట్లు ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కంపెనీ వాటికి అధనపు భద్రతా సౌకర్యాలతో పాటు మరిన్ని ఆకర్షనీయమైన పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని చెప్పవచ్చు.

ఇకపోతే.. కాంపాక్ట్ కార్ విభాగం విషయానికి వస్తే.. మారుతి సుజికి కార్లయిన జెన్ ఎస్టిలో, ఏ-స్టార్‌లు వినియోగదారుల సంతృప్తిలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అలాగే అప్పర్ ప్రిమీయం విభాగంలో వోక్స్‌వ్యాగన్ పోలో, మారుతి సుజికి స్విఫ్ట్‌లు నంబర్ వన్‌గా ఉండగా.. ఎంట్రీలెవల్ మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో.. మారుతి సుజికి స్విఫ్ట్‌ డిజైర్ టాప్‌లో ఉంది.

ఇంకా.. ప్రిమీయం మిడ్-సైజ్ సెడాన్‌లో టొయోటా కరోలా, ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్‌లో వోక్స్‌వ్యాగన్ పస్సాట్, స్పోర్ట్స్ యుటిలిటీ, మల్టీ యుటిలిటీ వెహికల్ విభాగాల్లో టొయోటా ఇన్నోవా, మహీంద్రా స్కార్పియోలు, అలాగే.. ప్రిమీయం స్పోర్ట్ యుటిలిటీ సెగ్మెంట్లో హోండా సీఆర్-వీలు వినియోగదారులను సంతృప్తిపరచడంలో అగ్రస్థానాల్లో నిలిచినట్లు ఆ సర్వే పేర్కొంది. మొత్తం 9,300 కార్లపై ఈ సర్వే నిర్వహించారు.

More from DriveSpark

Article Published On: Friday, February 25, 2011, 8:07 [IST]
English summary
Tata Nano Tata Motor's Nano has been ranked last among entry level small cars in terms of customer satisfaction, according to market research firm TNS. In the '2010 four-wheeler Total Customer Satisfaction (TCS)' study by TNS Automotive, Maruti Suzuki India's (MSI) best selling model Alto topped the entry level small car category.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+