ఆల్టో వర్సెస్ ఇయాన్: గెలిచేదెవరు..? ఓడేదెవరు..?

మారుతి సుజుకి విడుదల చేసే ప్రతి ఉత్పత్తి పోటీగా మరో ఉత్పత్తి విడుదల చేసే హ్యుందాయ్ ఇప్పుడు ఆల్టో ధీటుగా తమ చిన్న కారు 'ఇయాన్'ను సిద్ధం చేసింది. ధర, మైలేజ్, భద్రత, సౌకర్యం ఇలా ఏ విషయంలోనూ రాజీపడకుండా.. దేశీయ కొనుగోలుదారులను దృష్టిని, మనస్సును ఆకర్షించేదుకు సిద్ధమైంది. హ్యుందాయ్ తన తొలి చిన్న కారు (శాంత్రోకు దిగువన) ఇయాన్‌ను ఈ నెల 13న దేశీయ విపణిలో అధికారికంగా విడుదల చేయనుంది.
మారుతి ఆల్టో ఎక్స్టీరియర్ ఫ్లాట్‌గా షార్ప్ కటింగ్స్ కలిగి ఉంటుంది. అయితే, హ్యుందాయ్ ఇయాన్ ఎక్స్టీరియర్ వంపుగా ఉండి ఫ్లూయిడిక్ వెర్నా డిజైన్‌ను తలపిస్తుంది. డిజైన్‌లో ఆల్టో కన్నా ఇయాన్ కాస్తంత మెరుగ్గానే ఉంటుందని చెప్పొచ్చు. ఆల్టో ఇంటీరియర్స్ పెద్దగా ఆకట్టుకోవు. కానీ ఇయాన్‌లో డ్యూయెల్ కలర్ ఇంటీరియర్స్ ఉండి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. మైలేజ్‌లో కూడా ఆల్టోను ఇయాన్ ఓవర్‌టేక్ చేసిందని చెప్పవచ్చు.
ఇయాన్ ఏఆర్ఏఐ సర్టిఫై చేసినదాని ప్రకారం, లీటరుకు 21.1 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇయాన్ 814సీసీ ఇంజన్‌ను కలిగి ఉండి 55 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే పెర్ఫామెన్స్‌లో మారుతి ఆల్టో కన్నా ఇది దాదాపు 15 శాతం అధికం. అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ఒక్క విషయంలో మాత్రం మారుతిని హ్యుందాయ్ ఓవర్‌టేక్ చేయలేదు. మారుతి సుజుకి ఉన్నన్ని సర్వీస్ అవుట్‌లెట్లు హ్యుందాయ్‌కు లేవు. మరి ఈ రేస్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications








